గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం పౌర సదుపాయాల కల్పనలో ఒక మైలు రాయిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి అమరావతి వచ్చిన గూగుల్ క్లౌడ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ ఎండీ బిక్రమ్ సింగ్ బేడీ ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. రోజువారీ జీవితంలో పౌరులకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలు, ఇతర అన్ని సేవలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సెల్ ఫోన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనే దే ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ పేర్కొన్నారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ ను ప్రజలకు చేరువ చేయడమే ప్రధానోద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా స్కిల్స్ ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
Previous Articleప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ :కొనసాగుతున్న డ్రాల పర్వం
Next Article భూటాన్ రాజు భారత పర్యటన: ప్రధాని మోడీతో సమావేశం