ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో వరుస డ్రాలకు తెరపడింది. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ విజయం సాధించి ముందడుగు వేశాడు. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమం చేశాడు. ఆతర్వాత నుండి వరుసగా 7 డ్రా లతో ఈ ఛాంపియన్ షిప్ సాగింది. మొత్తం 8 గేమ్ లు డ్రా అయ్యాయి.కాగా, తాజాగా జరిగిన 11వ గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ పై గుకేశ్ గెలుపొందాడు. 29 ఎత్తుల్లో గేమ్ ముగించి 6-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 3 గేమ్ లు ఉన్నాయి. ఇంకా 1.5 పాయింట్లు సాధిస్తే ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్ షిప్ లో విశ్వనాథన్ ఆనంద్ తరువాత టైటిల్ గెలిచిన భారత ఆటగాడిగా నిలుస్తాడు.
Previous Articleఆర్ ఆర్ ఆర్ చిత్రంపై డాక్యుమెంటరీ
Next Article ప్రేమ పై సమంత పోస్ట్ వైరల్