అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహార వీరమల్లు’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పీరియాడికల్ కథాంశంతో రూపొందుతోంది.
‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. పవన్ ఈ చిత్రీకరణలో పాల్గొననున్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ అలరించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎంకీరవాణీ సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఈచిత్రానికి పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం వచ్చే ఏడాది మార్చి 28న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Previous Articleరాజధాని అమరావతిలో చేయాల్సిన పనులకు ఆమోదం
Next Article బోయింగ్‌లో భారీగా ఉద్యోగాలు తొలగింపు