వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ లో నేడు జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనకు ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండో కలెక్టర్ల సదస్సు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ద్వారా గత ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్ మీదకు వెళ్లిన రాష్ట్రానికి ఆక్సిజన్ అందించి ప్రజలు బతికించుకున్నట్టు అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని తీసుకొస్తుందని ఆ సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా మన నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని వివరించారు. ఐటీ మంత్రి ఇటీవల అమెరికా పర్యటనలో వివిధ కంపెనీలతో చర్చించారని దీని ఫలితంగా విశాఖకు గూగుల్ రానుందని తెలిపారు. ఈ రోజే ఎంఓయు కూడా ఏపీ ప్రభుత్వంతో గూగుల్ చేసుకుందని వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు