ఉమ్మడి ప్రకాశం జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సూపర్-6 అమలుపై కూటమి నేతల్ని ప్రజలు నిలదీస్తున్నారని దుయ్యబట్టారు. సమాధానం చెప్పలేక నెలకొక డైవర్షన్ పాలిటిక్స్‌ను కూటమి నేతలు తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ గత కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్నారని అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు? అని నిలదీశారు. మెడికల్ కాలేజీలు, పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. మనం అందరం పోరుబాట పట్టాల్సిన టైమ్ వచ్చేసిందని శ్రేణులకు పిలుపునిచ్చారు.
Previous Articleప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని తీసుకొస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article చూపు తిప్పుకోలేకపోయా: వెంకటేష్