అల్లు అర్జున్‌ను ప్రదర్శనపై తెలుగు అగ్ర కథానాయకుడు వెంకటేష్ ప్రశంసలు కురిపించారు.చూపు తిప్పుకోలేకపోయానంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘అల్లు అర్జున్.. నీ యాక్టింగ్ అత్యద్భుతంగా ఉంది.ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శన ఇది.నీ నుండి చూపు తిప్పుకోలేకపోయా.దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉంది.రష్మిక యాక్టింగ్ చాలా బాగుంది.చిత్ర దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తోపాటు టీమ్ అందరికి కంగ్రాట్స్’’ అని పేర్కొన్నారు.దీనిపై అల్లు అర్జున్ స్పందించారు.‘‘థాంక్యూ సర్.మీ నుండి ప్రశంసలు రావడం చాలా ప్రత్యేకంగా ఉంది.మా వర్క్ మీకు నచ్చినందుకు ఆనందంగా ఉందని రిప్లై ఇచ్చారు.
Previous Articleమనం అందరం పోరుబాట పట్టాల్సిన సమయం వచ్చేసింది:మాజీ సీఎం జగన్
Next Article మార్చి 17 నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు

