జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా డబ్బులు చెల్లించారా? అని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రైతులను దగా చేసిన మీకు ర్యాలీలు చేసే అర్హత ఉందా? అని ఆక్షేపించారు. కనీసం గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. మీ చేతగాని పాలనలో ఈ సమయానికి- కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని వైసీపీపై మండిపడ్డారు. బాధ్యత కలిగిన కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 48 గంటలలోపే డబ్బులు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండని గణాంకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండి.
మీ చేతగాని పాలనలో ఈ సమయానికి- కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాము. 48 గంటలలోపే డబ్బులు జమ చేస్తున్నాము. జగన్ పాలనలో ఏ రోజైనా… pic.twitter.com/hvvoFtEuSs— Manohar Nadendla (@mnadendla) December 11, 2024