ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిందని ఆయన పేర్కొన్నారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామని అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టినట్లు వివరించారు. ‘రాష్ట్రమే ఫస్ట్…ప్రజలే ఫైనల్’ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతతో ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర – 2047 విజన్ తో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 గా నిలబెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రమే ఫస్ట్…ప్రజలే ఫైనల్’ నినాదంతో ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleజగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా డబ్బులు చెల్లించారా?: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్
Next Article ప్రకాశం జిల్లా జవాన్ వీరమరణం…!

