దర్శకుడు అట్లీని హిందీ కమెడియన్ కపిల్ శర్మ అవమానించేలా వ్యాఖ్యానించారు. తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్న దర్శకుడిని లుక్ విషయంలో విమర్శలు చేశాడు. దీనిపై దర్శకుడు స్పందించాడు. ‘‘టాలెంట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నామనేది విషయం కాదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. తొలిసారి కథతో ఆయన వద్దకు వెళ్లగా ఆయన నా స్క్రిప్ట్ ఇష్టపడి సినిమా ప్రొడ్యూస్ చేశారు. నా లుక్ గురించి ఆయన ఏమీ ఆలోచించలేదు’’ అని బదులిచ్చారు. తీవ్ర చర్చకు దారి తీసిన ఈ విషయంపై నెటిజన్లు కపిల్‌ను తప్పుబడుతున్నారు. కమెడియన్‌ను తిడుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Previous Articleబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: మూడో రోజు ఆటలో కూడా ఆసీస్ ఆధిపత్యం
Next Article హీరో ప్రభాస్‌కు గాయం..!