సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ అనే చిన్నారి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.తాజాగా ఆ బాలుడి కుటుంబాన్ని దర్శకుడు సుకుమార్ పరామర్శించారు.బాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అవసరం అయిన సాయం అందిస్తామని మాట ఇచ్చారు.మరోవైపు శ్రీ తేజ కుటుంబాన్ని ను ఇటీవల సుకుమార్ సతీమణి తబిత కలిశారు.రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు.పుష్ప 2 బెనిఫిట్ షో ను సంధ్య థియేటర్లో ప్రదర్శించగా అల్లు అర్జున్ ఆకడికి వెళ్ళారు.ఆయన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.దీంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందింది.ఆమె తనయుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు.
Previous Articleఇండియన్ 2…వాటిని నేను అసలు ఊహించలేదు శంకర్
Next Article ఉగండాలో కనుగొన్న ” డింగా డింగా ” వైరస్…!

