తాజాగా చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘అమరన్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో తను నటనతో ఆకట్టుకున్న సాయి పల్లవి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ‘మహారాజ’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన విజయ్ సేతుపతి ఉత్తమ నటుడుగా నిలిచారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు పురస్కారాలు అందుకున్నారు.
ఉత్తమ చిత్రం: అమరన్
ఉత్తమ నటుడు : విజయ్ సేతుపతి (మహారాజ)
ఉత్తమ నటి: సాయిపల్లవి (అమరన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సీహెచ్ సాయి (అమరన్)
ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (అమరన్)
రెండో ఉత్తమ చిత్రం: లబ్బర్ పందు
ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు)
ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు)
ఉత్తమ బాలనటుడు: పొన్వెల్ (వాళై)
ఉత్తమ సహాయనటి: దుషారా విజయన్ (వేట్టయన్)
ఉత్తమ రచయిత: నిథిలన్ సామినాథన్ (మహారాజ)
ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ (అమరన్)
స్పెషల్ జ్యూరీ అవార్డు : మారి సెల్వరాజ్ (వాళై), పా.రంజిత్ (తంగలాన్).
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్:ఉత్తమ నటి సాయి పల్లవి.. ఉత్తమ నటుడుగా విజయ్ సేతుపతి
By admin1 Min Read