స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అన్యాయంగా నిలిచిన ఎమర్జెన్సీకి నేటితో 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెలల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా విధింపజేశారు.1977 మార్చి 21 వరకు ఇది కొనసాగింది. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ప్రజాస్వామ్యవాదుల గృహ నిర్బంధం వంటివి ఈ చీకటి సమయంలో రాజ్యమేలాయి. దేశంలో 21 నెలల పాటు నియంతృత్వ పాలన కొనసాగింది. అంతర్గత అలజడుల పేరుతో ప్రతిపక్ష నేతలను అన్యాయంగా జైలుకు పంపారు.ప్రెస్‌ను నిషేధించారు. ప్రతిపక్ష స్వరం అణిచివేశారు. మౌలిక హక్కులను నిలిపివేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్. కె. అద్వానీ, జార్జ్ ఫెర్నాండిస్, మోరార్జీ దేశాయ్ వంటి గొప్ప నాయకులు జైలుకి వెళ్లారు. ప్రజాస్వామ్య వాదులు దీనిని రాజ్యాంగ ద్రోహంగా అభివర్ణించారు . ఇది జరిగిన 50 ఏళ్ల అనంతరం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు నిబద్ధంగా పోరాడిన నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ మనం “సంవిధాన్ హత్యా దివస్” జరుపుకుంటున్నాం.
Manohar.T (content scribe)
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు