బాలీవుడ్ కపుల్ బిపాసా బసు,ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పై ప్రముఖ సింగర్ మికా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వారితో పని చేయడాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు.వారితో పని తనకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చిందని ఆయన వాపోయారు.వారు తన డబ్బును వృథా చేశారని ఆరోపించారు.
“ నేను నిర్మించిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ ‘డేంజరస్’. ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ అందించిన కథతో దీనిని రూపొందించాం.కరణ్ సింగ్ గ్రోవర్ అయితే కథకు సెట్ అవుతారనిపించింది.ఆయనకు జంటగా నూతన నటిని ఎంచుకుంటే బడ్జెట్ పరిధి లో ఉంటుందనుకున్నా.ఆ సమయంలో బిపాసా బసు మా టీమ్ లోకి వచ్చారు.హీరోయిన్ గా తాను యాక్ట్ చేస్తానని అన్నారు.బడ్జెట్ గురించి అలోచించి ఓకే చెప్పా.ఆ తర్వాత ఈ జంట నాకు
ఎన్నో సమస్యలు సృష్టించారు.మూడు నెలల షూట్ ఆరు నెలలు అయ్యేలా చేశారు.లండన్ కు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ ఒక్క రూమ్ తీసుకుంటే.. కాదు మాకు వేరు వేరు రూమ్ లు కావాలని గొడవ చేశారు.అదేం ప్రవర్తనో నాకు అర్ధం కాలేదు.వాళ్ళతో వర్క్ చేశాక మళ్లీ నిర్మాణ రంగంలోకి రాకూడదని నిర్ణయించుకున్నా. ‘ అని మికా సింగ్ తెలిపారు.