ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహా కుంభ్‌నగర్‌లో త్వరలో జరగనున్న కుంభమేళాకు ఏర్పాట్లు భారీ స్థాయిలో చేస్తున్నారు. గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమ స్థలిలో 2,000 డ్రోన్లతో ఆకాశంలో అద్భుత ప్రదర్శన నిర్వహించనున్నారు.జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళా ఆరంభ, ముగింపు దినాల్లో డ్రోన్ల ప్రదర్శన ఉంటుందని జిల్లా పర్యాటక అధికారి వెల్లడించారు.ఈ డ్రోన్ల తో ప్రయాగ మహత్యం, మహా కుంభ్ కథలను ప్రదర్శించనున్నారు.క్షీర సాగర మథనం, అమృత కలశ ఆవిర్భావాలనూ చూపించానున్నారు.పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను ప్రపంచస్థాయి ఉత్సవంగా నిర్వహించాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ భావిస్తున్నారు.అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

