బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు అయిన విషయం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి చర్యలపై కర్ణాటక హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.తనపై నమోదు అయిన ఛార్జ్‌షీట్‌ను సవాలు చేస్తూ కొంతకాలం క్రితం హేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.దీనిపై న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది.హేమ నిషేధిత పదార్థాలను తీసుకొన్నట్లు నిర్ధరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.వాదోపవాదాలు విన్న న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది.సుమారు నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని పేర్కొంది.
Previous Articleతండ్రి లైంగిక వేధింపులు…షూట్ కు వచ్చి కొట్టేవాడు: ఖుష్బూ
Next Article కన్నప్పలో ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్…!