‘క’తో గతేడాది తన కెరీర్‌లోనే సూపర్‌హిట్‌ను అందుకున్నారు నటుడు కిరణ్ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దిల్ రూబా’.ఈ చిత్రానికి విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుంది.మనసుని హత్తుకునే ప్రేమ కథతో ఇది రూపుదిద్దుకుంటుంది.ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఈరోజు ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఇందులో ప్రేమికుడి పాత్రలో కిరణ్ అబ్బవరం నటన,డైలాగ్స్ యువతను ఆకట్టుకునేలా సాగింది.ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని రవి,జోజో జోస్ నిర్మిస్తున్నారు.
Previous Articleబెంగళూరులో పర్యటించిన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం
Next Article మెడికల్ సీట్ల భర్తీ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు…!