విశాల్ హీరోగా సుందర్.సి తెరకెక్కించిన చిత్రం “మద గజ రాజా”.ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలుగా నటించారు.దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇది విడుదలవుతోంది.ఈ సినిమా ప్రెస్‌మీట్ ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఇందులో పాల్గొన్న విశాల్ కాస్త అనారోగ్యంగా కనిపించారు.స్టేజ్‌పై మాట్లాడే సమయంలో ఆయన తడబడ్డారు.చేతులు కూడా వణికిపోతూ కనిపించాయి.వైరల్ ఫీవర్‌తో ఆయన కార్యక్రమానికి వచ్చారని.. అందుకే ఆవిధంగా ఇబ్బందిపడ్డారని అక్కడే ఉన్నయాంకర్ తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.విశాల్‌కు ఏమైందని అందరూ మాట్లాడుకుంటున్నారు.గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు,
Previous Articleరూమ్స్ కావాలంటే సర్టిఫికేట్స్ చూపించాల్సిందే..!
Next Article పుష్ప – 2 సరికొత్త రికార్డు…!