సినీ నటి నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి తనని వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ కామెంట్స్ పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియ జేశారు.బాలీవుడ్ కు చెందిన నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లోనూ రాణిస్తున్నారు.సవ్య సాచి తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ది రాజా సాబ్,హరిహర వీరమల్లు కోసం వర్క్ చేస్తున్నారు
Previous Articleతొక్కిసలాట ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు
Next Article హాలీవుడ్ ను చుట్టు ముట్టిన కార్చిచ్చు…!