‘గేమ్ ఛేంజర్’ సినిమా పైరసీ కాపీని ప్రసారం చేసిన ఓ టీవీ ఛానల్ నిర్వాహకులపై గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రామ్‌చరణ్, శంకర్ కాంబోలో ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. దీని పైరసీ కాపీనీ ఏపీలో ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారం చేయడంతో కేసు నమోదైంది.ఈమేరకు గాజువాక పోలీసులు, సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.పలువురిని అరెస్టు చేశారు.
పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్‌గా ‘గేమ్ ఛేంజర్’ రూపుదిద్దుకుంది.కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీనిని నిర్మించారు.ఎన్నో అంచనాల మధ్య జనవరి 10న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే దీనిని పైరసీ చేసిన కొంతమంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో పెట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకుని సైబర్ క్రైమ్ టీమ్‌కు ఫిర్యాదు చేసింది.