విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైలా’.ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ సంస్థపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది. విశ్వక్ సేన్ సోను అనే ఓల్డ్ సిటీ కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు.బ్యూటీ పార్లర్ నడిపే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకునేలా ఉంది.టీజర్ చివర్లో లేడీ గెటప్ లో విశ్వక్ లుక్స్ అలరిస్తున్నాయి.ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14 న ఇది విడుదల కానుంది.
Previous Articleఇండియా ఓపెన్ సెమీస్ లోకి డబుల్స్ ద్వయం సాత్విక్- చిరాగ్
Next Article హెచ్ 1బీ నిబంధనల్లో మార్పులు