బాలీవుడ్ నటి కంగన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. జనవరి 17 న ఇది విడుదలైంది. దీనిపై పంజాబ్ లో బ్యాన్ విధించడం గురించి కంగన తాజాగా స్పందించారు.మా చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.మా చిత్రంపై మీరు ఎంతో ప్రేమను కనబరుస్తున్నారు.మీ ఆదరణ చూసి మాకు మాటలు రావడం లేదు.అయితే, పంజాబ్లో మా సినిమాపై నిషేధం విధించడం నన్ను ఒకింత బాధకు గురి చేసింది.ఒకానొక సమయంలో నా చిత్రాలు ఆ రాష్ట్రంలో బాగా ఆడేవి.కానీ ఇప్పుడు నా సినిమా అక్కడ విడుదల కూడా కాలేదు.కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ రకమైన విద్వేషాలు ఏర్పడుతున్నాయి.నాలోని దేశభక్తికి నిదర్శనంగా దీనిని రూపొందించా.ఇది మనల్ని ఏకం చేస్తుందా? లేదా? అనే విషయాన్ని సినిమా చూసి మీరే తెలుసుకోండి” అని కంగన చెప్పారు.
Previous Articleభైరవం టీజర్ రిలీజ్
Next Article దేశవాళీ క్రికెట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ