విష్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకుడు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. లియోన్ జేమ్స్ అందించిన స్వరాలకు పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఆదిత్య ఆర్కె. ఎం.ఎం. మానసి ఆలపించారు. రొమాంటిక్ యాక్షన్ చిత్రంలో విష్వక్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు.
Previous Articleమహాకుంభమేళా 2025లో.. 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు
Next Article అమెరికాలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు: ట్రంప్ వ్యాఖ్యలు