బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దుండగుడి దాడి నుంచి కోలుకుంటున్నారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకొన్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నటుడిని ఆసుపత్రికి వెళ్లడంలో సాయం చేసిన ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణాకు పంజాబీ గాయకుడు మికా సింగ్ రివార్డు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఎంతో మందికి ఇష్టమైన సూపర్ స్టార్ సైఫ్‌ను కాపాడినందుకు భజన్ సింగ్ భారీ రివార్డుకు అర్హుడని నేను నమ్ముతున్నా. అతడు సకాలంలో స్పందించడం అభినందనీయం. ఎవరికైనా అతడి పూర్తి వివరాలు తెలిస్తే నాకు చెప్పండి. అతడికి రూ.1లక్ష బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా’’ అని మికా సింగ్ పోస్ట్ పెట్టారు. తాజాగా సైఫ్ కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ముందు ఆటో డ్రైవర్‌ను కలిసి అభినందించారు. క్లిష్ట సమయంలో తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన కూడా ఆటోడ్రైవర్‌కు రివార్డు ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Previous Articleఉబర్, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు
Next Article రిటైర్మెంట్‌పై స్పందించిన రష్మిక