రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ వెబ్ ప్రాజెక్ట్‌తో బిజీగా మారిన నటి సమంత. విడుదల తర్వాత రిలాక్సేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత బిజీగా మారిపోయారు. వరుస ఈవెంట్స్‌లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. జీవితంలో ప్రతి దాన్ని చివరిదిగా భావించే దశలో తాను ఉన్నానని సామ్ తాజాగా తెలిపారు.ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఇందులో సామ్ మాట్లాడుతూ.. సాధారణంగా ఉండే సినిమాలను ఎన్నో అంగీకరించొచ్చన్నారు.తాను మాత్రం కచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపే వాటినే ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు.వంద శాతం నమ్మితేనే ఆ పాత్రలను చేస్తానని, లేకపోతే చేయలేనని తెలిపారు.సవాలుగా అనిపించే పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడించారు.రాజ్ అండ్ డీకే ఎక్కువగా సవాలుగా అనిపించే పాత్రలనే రూపొందిస్తున్నారని…వారితో వర్క్ చేయడం తనకు ఎంతో సంతృప్తిగా ఉంటుందని సామ్ చెప్పుకొచ్చారు. గొప్ప సినిమాలో నటించాననే ఫీల్ రాకపోతే వర్క్ చేయలేనని సామ్ వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు