మ్యాడ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘8 వసంతాలు’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మధురం, మను లాంటి బ్యూటిఫుల్ సినిమాలు తీసిన ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూస్తుంటే.. ఒక బ్రేకప్ స్టోరీకి సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఫణింద్ర నరిశెట్టి తనదైన డైలాగ్స్ తో సినిమాని నడిపిస్తాడని అర్థమైపోతుంది టీజర్ చూస్తుంటే. టీజర్లోనే ప్రేమ, బ్రేకప్ కి సంబంధించి పలు డైలాగ్స్ ఉన్నాయి. టీజర్ లో అన్నీ రివర్స్ షాట్స్ తో అందంగా ఆహ్లాదంగా చూపించారు. టీజర్ 1 అంటూ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు ఇంకో టీజర్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
Previous Articleవారాంతంలో తగ్గిన సూచీలు జోరు..!
Next Article 500ల మంది అక్రమ వలసదారులు అరెస్ట్