పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిష్, జ్యోతికృష్ణ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈచిత్రం లో బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. అందులో రాజుల కాలం నాటి దుస్తుల్లో కత్తి పట్టుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఉన్న లుక్ లో కనిపించారు. ప్రస్తుతం బాబీ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇటీవలే ఈసినిమా నుంచి తొలి పాట విడుదలైంది.‘మాట వినాలి గురుడా మాట వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్ కల్యాణ్ ఆలపించారు.ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది.
Previous Article‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ లో శిఖర్ ధావన్
Next Article ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు భారీ ఊరట

