రవితేజ కూడా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఆయనకు సరైన హిట్ పడి చాలా రోజులైంది. ‘ధమాకా’ తరువాత ఆయన నటించిన రావణసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి.ఇక ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
గీతాంజలి మళ్లీ వచ్చింది.వివాహ భోజనంబు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకుడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు.కాగా జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘మాస్ జాతర’ చిత్రం నుంచి గ్లింప్స్‌ను వదిలారు మేకర్స్.గ్లింప్స్‌లో రవితేజ ఎప్పటిలాగే ఎనర్జీగా కనిపించాడు.కానీ విజువల్స్ పరంగా, కంటెంట్ పరంగా కొత్తదనమేమీ కనిపించలేదు.రెగ్యులర్ రవితేజ సినిమాలో ఉండే కంటెంట్‌లానే అనిపించింది.యాక్షన్ సన్నివేశాలు, పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో రవితేజ… ఇలా పలు విజువల్స్ కనిపించినా గ్లింప్స్ లో ఎట్రాక్ట్ చేసే అంశమేమి లేకపోవడంతో ఆకట్టుకునే విధంగా అనిపించలేదు.శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.

