తమిళ నటుడు విజయ్ సేతుపతి పాన్ కార్డుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ కార్డు సమాచారాన్ని తమిళంలో కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్ధిక లావాదేవీలలో ఎంతో కీలకమైన పాన్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని కోరారు. వాటికి సంబంధించిన అప్ డేట్స్ తమిళంలో కూడా అందించాలని కోరారు. పాన్ కార్డు వివరాలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఉంటున్నాయని ఆ భాషలు రాని వారు పాన్ కార్డు అప్ డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తమిళ భాషని యాడ్ చేయడం కష్టమైనప్పటికీ ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలకు పాన్ కార్డు విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు వారికి అర్ధమయ్యే భాషలో సమాచారం ఉంటే వారు గందరగోళానికి గురికాకుండా ఉంటారన్నారు. భాషతో సంబంధం లేకుండా పౌరులందరూ అవసరమైన ఆర్థిక సమాచారం ఈజీగా తెలుసుకునేందుకు పాన్ కార్డు సంబంధిత వివరాలను పలు భాషల్లో అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు