కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’.ఈ చిత్రానికి నటుడు కమ్ దర్శకుడు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.ఇందులో
బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రం లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రలలో నటిస్తున్నారు.అయితే యష్ 19వ చిత్రంగా రూపొందుతోంది.తాజాగా ఈ చిత్రబృందం నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త వినిపిస్తుంది.ప్రస్తుతం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ముగిసిందని సమాచారం. ఈ షూట్ తర్వాత ఈరోజు బెంగళూరు షెడ్యూల్ మొదలైంది. టౌన్లో వేసిన ఓ స్పెషల్ సెట్లో చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి, తారాసుటారియాపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని చెబుతున్నారు.అయితే బ్రదర్-సిస్టర్ కథతో 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంపై యష్ అభిమానుల్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.ఈ చిత్రానికి జెరెమీ స్టాక్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని వెంకట్ కె నారాయణ ,లోహిత్ ఎన్ కె నిర్మిస్తున్నారు.
Previous Articleవైసీపీ సీనియర్ నాయకులతో అధినేత జగన్ భేటీ
Next Article కుంభమేళాలో ప్రధాని పూజలు …!