తమిళ నటుడు ధనుశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ ట్రైలర్ చూస్తూంటే పక్కా యూత్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది.అలాగే ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందినట్లు సమాచారం.’జాలీగా రండి.. జాలీగా వెళ్లండి’ అంటూ ధనుశ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.ఇందులో పావిష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Previous Articleగాజాలో హమాస్ లేకుండా చేస్తాం:- డోనాల్డ్ ట్రంప్
Next Article ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్…!