యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘మజాకా’ అనే చిత్రం తెరకెక్కింది.ఇందులో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్స్ రావు రమేష్,అన్షు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్తాన్ని ఈ ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్బ్యానర్స్ పై రాజేష్ దండాఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించింది.ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘మజాకా’ నుండి వరుస అప్డేట్స్ ఇస్తుంది చిత్రబృందం.తాజాగా ఈ సినిమాలోని ‘బేబీ మా’ ఫుల్ సాంగ్ విడుదల చేశారు.ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.