టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’.ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో విష్ణు కు జోడిగా ప్రీతి ముకుంద్ నటిస్తుంది.ఇందులో మోహన్ బాబు రెబెల్ స్టార్ ప్రభాస్ , మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘శివ శివ శంకర’ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ పాటను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ గురూజీ విడుదల చేశారు.ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా.. సాంగ్ లింక్ షేర్ చేశారు విష్ణు.అయితే ఈ పాటను విజయ్ ప్రకాశ్ పాడారు.ఈ చిత్రానికి స్టీపెన్ దేవస్య్ సంగీతం అందిస్తున్నాడు.ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.