నితిన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’.దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు.ఈ చిత్రం నుండి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు.అయితే చిత్రబృందం సినిమాలో రెండో సింగిల్ సాంగ్ సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.అయితే గూసి బేబీ నువ్వు గుచ్చి గుచ్చి చూడద్దే అంటూ సాగే
సెకండ్ సింగిల్ ను చిత్రబృందం విడుదల చేసింది.ఇందులో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈ సినిమాను మార్చి 28 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్దమైంది.
Previous Articleచెక్కు చెదరని మోడీ వేవ్:మూడ్ ఆఫ్ ది నేషన్ లో వెల్లడి
Next Article హాను-ప్రభాస్ చిత్రంలో అనుపమ్ ఖేర్: వెల్లడించిన నటుడు