రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’.ప్రస్తుతం ఈ చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు రుపొందిస్తున్నాడు.ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తుంది.ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది.స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారని సమాచారం.
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో కీలకమైన బ్రిటిష్ యువరాణి పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించనున్నారని సమాచారం.యువరాణి పాత్ర ఇందులో కీలకం కావడంతో..ఈ పాత్ర కోసం ఆలియా భట్‌ని తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు.అయితే ఈ విషయంపై చిత్రిబృందం నుండి అధికారక ప్రకటన రావాల్సింది ఉంది.కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు.