తమిళ అగ్రనటుడు తలా అజిత్ కుమార్ మరోసారి ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే 2 నెలల క్రితం దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా ఆయన కారు సమీపంలోని గోడను బలంగా ఢీకొన్న సంగతి తెలిసిందే.కాగా ఆ ప్రమాదంలో కారు ముందు భాగం ఛిద్రం అయ్యింది, అజిత్ మాత్రం సురక్షితంగా బయట పడ్డారు.మళ్లీ అజిత్‌కి స్పెయిన్‌లో అలాంటి ప్రమాదమే ఎదురైంది.అక్కడ జరుగుతున్న రేసింగ్‌లో వేగంగా కారు నడుపుతూ, మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ట్రాక్‌పై పల్టీలు కొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా కారు నుండి బయటకు వచ్చేశారు.వెంటనే సిబ్బంది సైతం అప్రమత్తమయ్యింది.తాజాగా ఈ వీడియోను ‘అజిత్ కార్ రేసింగ్ టీమ్’ ఇన్‌స్టాలో షేర్ చేసింది.కాగా అజిత్ సురక్షితంగానే ఉన్నారని ఈ పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రమాదంలో అజిత్ తప్పేం లేదని,ఇతర కారు వలెనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తరువాత అజిత్ కారు నుండి బయటకు వచ్చి…అభిమానులతో ఫొటోలు దిగారు.