ఇటీవల హిందిలో విడుదలై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘చావా’. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దీనిని తెరకెక్కించారు. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. 12 రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్ల వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తున్న ‘ఛావా’ ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మార్చి 7న తెలుగులో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు తెలుగులో విడుదల చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ తెలిపింది. కాగా నేడు తెలుగు ట్రైలర్ ను విడుదల చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు