తమిళ నటుడు కార్తికి ప్రమాదం జరిగింది.ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సర్దార్ 2’. అయితే ఈ చిత్రం 2022లో వచ్చిన స్పై, యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా జరుపుకుంటుంది.అయితే ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పడు కార్తికి ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.ఈ మేరకు కార్తీ కాలికి గాయం కాగా.. వెంటనే స్పందించిన చిత్రబృందం అతడిని ఆస్పత్రికి తరలించిందని సమాచారం.
ప్రస్తుతం కార్తికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.అయితే కార్తికి ఇది ఈ సినిమా చిత్రీకరణలో జరిగిన రెండో ప్రమాదం.కాగా దీనికి ముందు కూడా సర్దార్ 2 సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం జరిగింది.ఇందులో రజిషా విజయన్,ఎస్జే సూర్య,మాళవిక మోహనన్,ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.