నటుడిని కాకపోయి ఉంటే రాజకీయాల్లోకి వెళ్లేవాడినని టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం అన్నాడు.తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘దిల్ రుబా’.కాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుంది.ఈ నెల 14తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రమోషన్స్‌కి సంబంధించి వరుస ఇంటర్వ్యూలలో కిరణ్ మాట్లాడుతూ…సినిమాలకు రాకముందు జీవితంలో ఎదోకటి పెద్దగా సాధించాలనే కోరిక ఎప్పుడు ఉండేదని అన్నారు. అయితే అందులో భాగంగానే హీరో అవ్వాలి అనుకున్నాను.అదే విధంగా నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం.రాయాలసీమకి చెందిన వ్యక్తిగా రాజకీయాలను చిన్ననాటి నుండి దగ్గరిగా చూశానని చెప్పాడు.ఒకవేళ నేను సినిమా హీరో కాకపోయి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడిని అన్నాడు.మంచి చెడుని పక్కనపెట్టి ప్రజలతో కలవడం నాకు ఇష్టం….దాని వల్లనే నాకు రాజకీయాలపై ఆసక్తి పెరిగిందని తెలిపాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

