తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.ఈ విషయాన్ని తాజాగా కార్తీ అధికారికంగా ప్రకటించాడు.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న “ఖైదీ 2”, కార్తీ పాత్ర ఢిల్లీకి జైలుకు వెళ్లే ముందు జరిగిన సంఘటనల ఆధారంగా సాగనుంది.డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ మరియు కన్నడ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.ప్రస్తుతం లోకేష్ “కూలీ” సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలుకానుంది.విక్రమ్,లియో సినిమాలతో కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవచ్చని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు.2019లో విడుదలైన “ఖైదీ” భారీ విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
DILLI RETURNS
Let it be another fantastic year @Dir_Lokesh@DreamWarriorpic @KvnProductions pic.twitter.com/sLLkQzT0re
— Karthi (@Karthi_Offl) March 15, 2025