టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంటులో బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో ఘన సన్మానం జరిపింది. ఈ పురస్కారం ద్వారా ఆయన సినీ పరిశ్రమకు, సామాజిక సేవా కార్యక్రమాలకు చేసిన కృషిని గౌరవించినట్లు పేర్కొంది.చిరంజీవికి అభినందనల వరద పారుతుండగా,తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా చిరంజీవిని అభినందిస్తూ, “సాంస్కృతిక నాయకత్వం, ప్రజాసేవలో మీ సేవలు అద్భుతం. మానవతా దృక్పథంలో మీరు నిజమైన ఛాంపియన్” అని ప్రశంసించారు. చిరంజీవి ప్రభావం అనేకమందికి స్ఫూర్తిగా మారిందని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ చట్టసభ వేదికగా అందుకున్న ఈ గౌరవం భారతీయ చిత్రసీమకు గర్వకారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మానవతా దృక్పథంలో మీరు నిజమైన ఛాంపియన్ అంటూ చిరంజీవిని అభినందించిన ఏపి సీఏం చంద్రబాబు
By admin1 Min Read

