కన్నడ స్టార్ కథనాయకుడు యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “టాక్సిక్”.ఈ చిత్రానికి నటుడు & దర్శకుడు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రంలో నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రలలో కనిపించనున్నారు.దర్శకుడు బ్రదర్-సిస్టర్ కథతో 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్ జరిగే చిత్రంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈచిత్రం విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. 2026 మార్చి 19న ఈచిత్రం విడుదల చేయనూన్నట్లు తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు.
19-03-2026 🙏 pic.twitter.com/9wk8ujqxgs
— Yash (@TheNameIsYash) March 22, 2025