భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటనగా నిలిచిన జలియన్ వాలాబాగ్ ఘటన ఆధారంగా ‘కేసరి చాప్టర్ 2’ సినిమా రాబోతోంది.బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మాధవన్,రెజీనా కసాండ్రా,అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.1919లో బ్రిటిష్ పాలకుల దురాగతాన్ని ఎదుర్కొన్న అమాయకుల కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే,జలియన్ వాలాబాగ్ ఘటన వెనుక చెప్పలేని నిజాలను బయటపెడతామని మేకర్స్ హింట్ ఇచ్చారు.ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.
You know the massacre, now uncover the untold truth. #KesariChapter2 in cinemas 18th April, worldwide. pic.twitter.com/ZhG3lmOhFs
— Dharma Productions (@DharmaMovies) March 29, 2025