టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన పూరీ జగన్నాథ్ ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో తెలుగు హీరోలు పూరీని పట్టించుకోవడం లేదని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి మళ్లీ దృష్టిని ఆకర్షించాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మించనున్న ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్ర షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని అధికారికంగా వెల్లడించారు.
ఇటీవల మహారాజాతో భారీ విజయాన్ని సాధించిన విజయ్ సేతుపతి హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అన్ని భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయి కాబట్టి, ఈ సినిమాపై కూడా ఆసక్తి పెరిగింది. పూరీ జగన్నాథ్ గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చినప్పటికీ, ఇటీవల వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమా విజయం సాధిస్తే పూరీకి మళ్లీ క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంతో పూరీ జగన్నాథ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి.