అగ్ర కథానాయకుడు నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హిట్ 3’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కాగా బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ ఫ్రాంచైజీకి మూడో చాప్టర్‌గా వస్తున్న ఈ చిత్రంలో నాని హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమాలో తమిళ నటుడు కార్తీ అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.ఇందులో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.
‘హిట్ 2’ చివర్లో కొత్త హీరో ఎంట్రీ ఇచ్చినట్టుగానే,‘హిట్ 3’ క్లైమాక్స్‌లోనూ ఒక కొత్త క్యారెక్టర్ ప్రవేశించనున్నట్లు టాక్.ఆ పాత్రను కార్తీ పోషించబోతున్నాడా? లేదా ‘హిట్ 4’కు ఇది లీడ్ ఇవ్వడమేనా? అనే ప్రశ్నలు అభిమానులను కుతూహలానికి గురిచేస్తున్నాయి.అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.ఇక ‘హిట్ 3’లో నాని పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ ‘అర్జున్ సర్కార్’ పాత్రలో కనిపించనున్నారు.కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, చిత్రాన్ని అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు.హిట్ ఫ్రాంచైజీకి మరో బిగ్ హిట్ తేల్చేలా ఈ సినిమా ఉండబోతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.