నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి అభిమానులు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదలైన సినిమా షూటింగ్ అనేక కారణాల వల్ల ఆగిపోయినట్టు సమాచారం.ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నా, అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి మోక్షజ్ఞ కోసం ప్రత్యేకంగా ఓ కథ సిద్ధం చేశారని సమాచారం.ఆ కథ బాలయ్యకు వినిపించారని, నచ్చితే వెంటనే సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.మరోవైపు,బాలయ్య హిట్ మూవీ “ఆదిత్య 369” సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞను పరిచయం చేయాలన్న ఆలోచన కూడా ఉంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధం చేశామని తెలిపారు.మోక్షజ్ఞ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.కానీ ఏ ప్రాజెక్ట్ మొదలవుతుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీపై ఉత్కంఠ మరింతగా పెరుగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు