‘తలా’ అంటూ అభిమానులు పిలుచుకునే తమిళ అగ్ర హీరో అజిత్ కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. త్రిష కథానాయికగా నటిస్తోంది. ప్రభు, సునీల్, ప్రియా వారియర్, యోగి బాబు, అర్జున్ దాస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు. జీ.వీ.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇక ఇందులో భాగంగా తాజాగా దీని తెలుగు ట్రైలర్ ను మేకర్స్ విడుదలచేశారు. ఆద్యంతం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ ట్రైలర్ రూపొందించారు. భయాన్నే భయపెడతాడు అనే డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు