చిత్రసీమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను నటి మాళవిక మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ముంబైలో పుట్టి పెరిగిన మాళవిక,దక్షిణ భారత చిత్రాల్లో అధికంగా అవకాశాలు పొందారు.అయితే,అక్కడ ఎక్కువగా దర్శక నిర్మాతలు తన నాభిపై ఫోకస్ పెడతారని,నాభిని జూమ్ చేసి చూపించడంపై తాను అసహనం వ్యక్తం చేశానని పేర్కొన్నారు.క్లోజ్‌అప్ షాట్లతో ఇబ్బంది పడతానని స్పష్టం చేశారు.అంతేగాక,ముంబైలో ఓసారి లోకల్ ట్రైన్‌లో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తనపై ఆవేదన వ్యక్తం చేశారు.కంపార్ట్‌మెంట్ బయట నిలబడి “ముద్దిస్తావా?” అంటూ సంకేతాలు చేయడం చూసి తాను భయపడ్డానని చెప్పారు.తన కెరీర్ ప్రారంభంలో ‘చాలా సన్నగా ఉన్నావు’ అని విమర్శలు ఎదురయ్యాయని, తర్వాత కొంచెం బొద్దుగా మారినా అదే రీతిలో ట్రోలింగ్‌కు గురైనట్లు తెలిపారు. “దక్షిణాదిలో హీరోయిన్ కాస్త బొద్దుగా ఉంటేనే అభిమానులకు నచ్చుతుంది. అందుకే హీరోయిన్ బొడ్డు మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. హీరోయిన్స్ కూడా తమ బొడ్డు కనిపించేలా ఫొటోలు షేర్ చేస్తూ పబ్లిసిటీ పెంచుకుంటారు” అంటూ మాళవిక ఘాటుగా స్పందించారు.
దక్షిణాది చిత్రాల్లో బొడ్డుపై ఫోకస్ ఎక్కువ అంటూ మాళవిక మోహన్ తీవ్ర వ్యాఖ్యలు
By admin1 Min Read