గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కింగ్డమ్’. మే 30న విడుదల కావాల్సిన ఈ మూవీ తాజాగా వాయిదా పడింది. ఈమేరకు మూవీ టీమ్ దీన్ని జులై 4న విడుదల చేయనున్నట్లు తెలిపింది. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని ఎంతో ప్రయత్నించాం. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీని వాయిదా వేస్తున్నాం. ఇలాంటి సమయంలో ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ అంటూ సందడి చేయకూడదు. అందుకే మేం సినిమాను జులై 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది.
Previous Articleభారత జవాన్ పూర్ణమ్ కుమార్ షాను అప్పగించిన పాక్
Next Article మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో లోకేష్ చర్చ