అసత్య ప్రచారం ఎక్కువ కాలం ఉండదని, ఎప్పటికైనా నిజం బయటపడుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశాడు.గోద్రా అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన ‘సబర్మతి రిపోర్ట్’చిత్రం ను ఉద్దేశించి ప్రధాని lఈ వ్యాఖ్యలు చేశారు.చిత్రబృందాన్ని మోదీ అభినందించారు.నిజం బయటకు రావడం చాలా మంచి విషయం,అది కూడా సామాన్యులకు తెలిసే పద్ధతిలో చూపించడం మంచి ప్రయత్నమని కొనియాడారు.ఈ మేరకు అలోక్ భట్ ట్వీట్ ను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు.గత శుక్రవారం ‘సబర్మతి రిపోర్ట్’ చిత్రం థియేటర్లలో విడుదలైంది.గోద్రా అల్లర్ల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాసే నటించారు.గోద్రా రైల్వే స్టేషన్ లో ట్రైన్ కు నిప్పు పెట్టడంతో 59 మంది సజీవదహనం కావడం,దీనితో గుజరాత్ లో అల్లర్లు చెలరేగడం తదితర సంఘటనలను ఇందులో చూపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఈ ఘటనలకు సంబంధించి ఈ చిత్రంలో కొత్త విషయాలను చూపించినట్లు చిత్రబృందం తెలిపింది.ఈ చిత్రానికి ధీరజ్ శర్మ దర్శకత్వం వహించగా ఏక్తాకపూర్ నిర్మాతగా వ్యవహరించారు.ఇందులో రాశి కన్నా తదితరులు నటించారు.కాగా నటి రాశి కన్నా ప్రధాని ట్వీట్ ను Instagram స్టోరీ లో షేర్ చేశారు.
https://x.com/narendramodi/status/1858086721180586287?t=ZLkfPJWajvIBToM3GflCGg&s=19