మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప.ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు .ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం నుండి కొత్త పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రతి సోమవారం ఓ అప్ డేట్ ఇస్తామని మంచు విష్ణు గతంలోనే ప్రకటించారు.ఈ మేరకు ఈరోజు ఆసక్తికరమైన పోస్టర్ ను తన ట్వీటర్ అకౌంట్ నుండి పోస్ట్ చేసాడు.
ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్ర పేరును అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో కనిపించనున్నారు. అయితే మోహన్ బాబు ముఖాన్ని పూర్తిగా చూపించలేదు. పూర్తి లుక్ ను నవంబరు 22న రివీల్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
https://x.com/iVishnuManchu/status/1858378558198239371?t=qCRUZuw0fh4GPfiWzGc8LA&s=19